కరోనా కియోస్కులు రక్షణ DRDO

రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డిఆర్డీఓ)కు చెందిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోగశాల(డిఆర్డీఎల్), హైదరాబాద్ కొరొనా వైరస్(కొవిడ్-19) నమూనాలను సేకరించడానికి కియోస్కుల(సిఓవిఎస్ఏసికె)ను అభివృద్ధి చేసింది.

రాష్ట్ర ఉద్యోగుల బీమా సంస్థకు చెందిన వైద్యుల సహకారంతో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోగశాల(డిఆర్డీఎల్), హైదరాబాద్ ఈ కియోస్కుల విభాగాలను అభివృద్ధి చేసింది. ఈ కోవ్సాక్ కియోస్కులను ఉపయోగించి కొవిడ్-19 సోకిన అనుమానితుల నమూనాలను సేకరించవచ్చు. ఈ యూనిట్ వెలుపలి నుండే ముందే సమకూర్చి ఉన్న చేతిమేజోళ్ళ ద్వారా ఆరోగ్య రక్షణ నిపుణులు రోగిని కియోస్కులోనికి నడవమని అతని ముక్కు మరయు నోటిని శుభ్రపరచడం ద్వారా నమూనాలను సేకరించవచ్చు.

ఈ కియోస్కు మనిషి ప్రమేయం లేకుండానే, అంటువ్యాధి వ్యాప్తిని నిరోధించగలుగుతుంది. ఈ కియోస్కుకు ఉన్న రక్షణ కవచం ఆరోగ్య కార్యకర్త నమూనాను సేకరించే సమయంలో గాలితుంపర ద్వారా ప్రసారం కాకుండా ఆరోగ్య కార్యకర్తను. రక్షిస్తుంది. ఇది ఆరోగ్య కార్యకర్తలకు పిపిఇల అవసరాన్ని తగ్గిస్తుంది.
రోగి కియోస్కును వీడిన తరువాత నాలుగువైపుల నుండి కియోస్కు కాబిన్లోనికి క్రిమిసంహారకాన్ని 70 సెకండ్ల పాటు పిచికారీ చేసి శుభ్రపరుస్తుంది, అనంతరం నీటితో కడిగి అతినీలలోహిత వెలుతురు ద్వారా శుభ్రపరుస్తుంది. తద్వారా రెండు నిమిషాల్లేనే తదుపరి వినియోగానికి తయారవుతుంది. ఈ కియోస్కులు రెండు వైపులా కంఠ ధ్వని ఆదేశాలను సమన్వయ పరచుకొని పనిచేస్తుంది. అందువలన ఇది వైద్య నిపుణులు ఈ యూనిట్ను లోపలి నుండి మరియు బయటి నుండి కూడా వినియోగించుకునే సౌకర్యం కలదు. దీని వెల సుమారు రు. లక్ష ఉంటుంది కాగా రోజుకు 10 యూనిట్లు అందిచడానికి కర్ణాటకలోని బెల్గాంకు చెందిన పరిశ్రమ ముందుకు వచ్చింది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డిఆర్డీఓ) రెండు యూనిట్లను తయారుచేసింది, వీటిన పరీక్షించగా విజయవంతమైన ఫలితాలు వెలువడ్డాయి, అనంతరం వీటిని హైదరాబాదులోని ఇఎస్ఐసి ఆసుపత్రికి అందజేసారు.