అంటువ్యాధులు అరికట్టే దివ్యౌషధం

శాస్త్ర మరియు సాంకేతిక విభాగం(డిఎస్టి) మరియు జీవసాంకేతిక విజ్ఞాన విభాగం(డిబిటి) సహాయ సహకారంతో పూణేకు చెందిన వుయ్ ఇన్నోవేట్ బయోసొల్యూషన్స్ అంకుర సంస్థ చేతులు మరియు పరిసరాల పరిశుభ్రత కోసం స్వంత సాంకేతికతతో నానో ఏజిసైడ్ తయారుచేసింది. ఈ మద్యరహిత సజల ఆధారిత జిగటగా ఉండే సిల్వర్ ద్రావణాన్ని తయారు చేయడానికి ముందుకు వచ్చింది.

ఈ ద్రావణం దహనశీలత లేని మరియు రసాయన రహిత అపాయకరము లేకుండా ఉండే ద్రావణం, ఇది ఒకరి నుండి ఒకరికి సంక్రమించే అంటురోగాలను నిరోధించడానికి, వైద్య రంగంలో పనిచేసేవారికి మరియు అంటురోగం సంక్రమించిన వారికి రక్షణగా పనిచేస్తుంది.

వుయ్ ఇన్నోవేట్ బయోసొల్యూషన్స్ తయారు చేసిన ఈ ద్రావణం అతి చిన్న రేణువులు గల సిల్వర్, ఇది ఆర్ఎన్ఏ మరియు వైరస్ ప్రసారాన్ని నిరోధిస్తుంది. ఇతర మద్య ఆధారిత క్రిమిసంహారిణులతో పోలిస్తే రసాయన రహితం మరియు దహనశీలత లేనిది. ఈ ద్రావణం ప్రయోగశాల పరీక్షలు పూర్తి చేసుకుని పరీక్షా అనుమతులను పొందింది. ప్రాథమికంగా దీనిని తక్కువ స్థాయిలో 5లీటర్ల వరకు తయారు చేసారు.

చేతుల సానిటైజర్లు మరియు క్రిమి సంహారిణులకు ప్రస్తుతం ఉన్న గిరాకీకి అనుగుణంగా మా తయారీ స్థాయిని బట్టి ప్రాథమికంగా రోజుకు కనీసం 200లీటర్ల కొలైడల్ సిల్వర్ ద్రావణాన్ని తయారుచేసే లక్ష్యంతో ఉన్నాము. ఈ ద్రావణంతో క్రిముల విస్తరణను నిరోధించగలమని తద్వారా భారత దేశాన్ని క్రిమి రహితంగా చేయడానికి సహాయం అందించగలమని ఆశిస్తున్నామని వుయ్ ఇన్నోవేట్ బయోసొల్యూషన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన డా. మిలింద్ చౌధురి తెలిపారు.

“కొవిడ్-19 వంటి నూతన వైరస్లు చాలా వేగంగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, ఈ నానోపార్టికిల్స్ వీటికి తగిన పరిష్కారాన్ని చూపుతాయి. వాటిని గుర్తించడం నుండి క్రిమిసంహారం చేయడం మరియు వాటి ప్రతిబింబాలను గుర్తించడం వరకు ఇవి చేస్తాయి. కొవిడ్-19తో పోలిస్తే ఈ నానోపార్టికల్స్ యొక్క పరిమాణం 100మిమి కంటే తక్కువ, అవదువలన ఇవి ఈ వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలవు అని శాస్త్ర మరియు సాంకేతిక విభాగం కార్యదర్శి
ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.

ఈ సిల్వర్ నానోపార్టికల్స్ ఎంతో సమర్థవంతమైనవి, ఇవి ప్రాణాంతకమైన హెచ్ఐవి, హైపటిటిస్ బి, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్, ఇన్ఫ్లూఎన్జా వైరస్ వంటి ఎన్నో వైరస్లను సమర్థంగా ఎదుర్కొంది. గ్లుటాటియోని కాప్డ్- Ag2S NC(సిల్వర్ నానోపార్టికల్) కొరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలదు. జపాన్ సైటామాకు చెందిన నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్కు చెందిన షింగో నకామురా కూడా ఏజి ఎన్పి(Ag NP)-ఆధారిత వస్తువులు రోగులతోపాటు ఆరోగ్య రంగంలో పనిచేసే వారిని క్రిముల నుండి రక్షిస్తాయని తెలిపారు. వుయ్ ఇన్నోవేట్ బయోసొల్యూషన్స్ సంస్థ తయారు చేసిన ఈ సానిటైజర్ ఆర్ఎన్ఏ ప్రతిరూపకల్పనను మరియు గ్లైకోప్రొటీన్ తలాన్ని నిర్భందించడం ద్వారా కొవిడ్-19ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ కొలైడల్ సిల్వర్ సానిటైజర్ల తయారీకి మరియు క్రిమిసంహారక తయారీకి అనుమతులు ఆమోదించబడ్డాయి.

తదుపరి వివరాలకోసం, డా.మిలింద్ చౌధురి, సహ-వ్యవస్థాపకులు, వుయ్ ఇన్నోవేట్ బయోసొల్యూషన్స్
ఇ-మెయిల్: [email protected],
మొబైల్: 9867468149)