దేశంలో లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ 20 నుండి మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు మరియు స్థిర వస్తువులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు స్నాప్‌డీల్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించడానికి అనుమతిస్తున్నారు.
ఏప్రిల్ 20 తర్వాత ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాల్లో నిత్యావసరేతర వస్తువులను ఆన్ లైన్ వ్యవస్థలో ఆర్డర్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. మే 3 వరకు లాక్డౌన్ 2ను పొడిగించిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 20 నుంచి ఇ-కామర్స్ కూడా అనుమతి రాబోతోంది.
సేవా రంగంలో డిజిటల్ వ్యవస్థ దేశాభివృద్ధికి చాలా అవసరం.అందువల్ల ఈ కామర్స్‌తోపాటు ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, ఆన్లైన్ బోధన, దూరవిద్య తరగతుల నిర్వహణకు అనుమతిస్తున్నాం” అని కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, ఈ కామర్స్ ద్వారా వస్తువుల రవాణాకు, సంబంధింత అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే.
అయితే ఇ-కామర్స్ వ్యవస్థలు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత వచ్చే వరకు వ్యాపారం చేసేందుకు సిద్ధంగా కనబడటం లేదు.