దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ – మేడిన్ హైదరాబాద్

దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ – మేడిన్ హైదరాబాద్

ఒకవైపు చమురు సంక్షోభం… మరో వైపు ఆర్థిక మందగమనం…డీజిల్ ధర ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పతనమవుతుందో తెలియదు.
అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరిగినప్పుడు మన దగ్గర పెట్రో ప్రోడక్ట్స్ ధరలు ఆకాశాన్నంటుతాయని అక్కడ తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ తగ్గించరు
ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో రైతులు, ఫ్యాక్టరీలకు వరంలా వచ్చింది ఈ ట్రాక్టర్ అదేనండీ ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ మన హైదరాబాద్ లోని బాలా నగర్ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యింది. దీన్ని స్టార్టర్ సంస్థ సెలెస్ట్రియల్‌ ఈ–మొబిలిటీ రూపొందించింది. దీని మోడల్ ను హైదరాబాద్ లోని తాజ్ బంజారాలో ఆవిష్కరించారు.

పొలం పనులకే కాదు, ఉద్యానవనాలు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు రవాణాకు వీలుగా 6 హెచ్‌పీ సామర్థ్యంతో తయారు చేశారు. 21 హెచ్‌పీ డీజిల్‌ ట్రాక్టరుకు సమానంగా ఇది పనిచేస్తుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ దురైరాజన్‌ చెప్పారు. దీని ధర ఐదగు లక్షలేనని వెల్లడించారు. ఇందులో కొంత సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది.

ఈ వాహనం ‘ధర రూ.5 లక్షల లోపు ఉంటుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా అందుకోవచ్చు. డీజిల్‌ ట్రాక్టరుతో గంటకు రూ.150 ఖర్చు వస్తే, దీనికి రూ.20–35 మధ్య ఉంటుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒక ప్యాటరీ అయిపోతే మరో బ్యాటరీని అప్పటికప్పుడే మార్చుకోవచ్చు. ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయాలంటే జస్ట్ సింగిల్ ఫేజ్ ఉన్నా 4 నుంచి 6 గంటలు చాలు అంటే
రాత్రి రెండు బ్యాటరీలను చార్జింగ్ పెట్టుకుంటే రోజంతా దున్నేయొచ్చన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ సంప్రదాయ డీజిల్ ట్రాక్టర్ కు గట్టిపోటీ ఇవ్వగలదన్నమాట. ఈ ట్రాక్టర్ కు ఏ రిపెయిర్ వచ్చినా ఆన్ లైన్ లో మెసేజ్ పెడితే చాలు వచ్చి సెట్ చేసేస్తారు. ఏడాదికి 8 వేల ట్రాక్టర్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకుంది సెలస్టియల్ ఈ మొబిలిటీ సంస్థ.