లాక్ డౌన్ ఏవి బంద్? ఏవి ఓపెన్?

కరోనా కారణంగా ఏవి బంద్? ఏవి ఓపెన్?దేశమంతటా75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలెవరు బయటకు రాకూడదు ఇంటికే పరిమితం అవ్వాలి. అలాంటప్పుడు మరీ నిత్యావసర వస్తువులు అలాగే
ఏవి బంద్? ఏవి ఓపెన్ ఉంటాయో పూర్తి వివరాలు
ఇక్కడ చూద్దాం.

1. రాష్ట్ర సరిహద్దులు మూసి వేశారు.
2. ప్రజా రవాణా, ఆటోలు, సెట్విన్, రైళ్లు, ట్యాక్సీలు అనుమతి రోడ్లపై నడిపేందుకు లేదు.
3. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదు.
4. నిత్యావసర వస్తువుల సమీకరణకు వాహనాలు అనుమతి.
5. అత్యవసర సేవలు వైద్యం కోసం ప్రజా రవాణా అనుమతి.
6. హోం క్వారన్ టైన్ వ్యక్తులు ఇళ్లకే పరిమితం అవ్వాలి. కాదని అతిక్రమిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు.
7. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా ఉండరాదు. 5మందికి మించి కలవరాదు. అత్యవసరమైన వాహనంలో డ్రైవర్, మరొకరు మాత్రమే ప్రయాణించాలి.
8. అన్ని ఆఫీసులు, దుకాణాలు, ఫ్యాక్టరీలు, వ్యాపార సముదాయాలు మూసివేయాలి.
9. పప్పు దినుసులు, పాలు, ఔషధ తయారీ, ఆహార తయారీ వ్యవస్థలకు మినహాయింపు.
10. బ్యాంకులు, ATMs, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా, IT, టెలికాం, పోస్టల్, ఇంటర్నెట్ సర్వీసులు ఓని చేస్తాయి.
11. e కామర్స్ (డోర్ డెలివరీ) సహాయంతో ఆహారం, ఔషధాలు, తిను బండరాలు సరఫరాకు అనుమతి.
12. నిత్యావసర తిను బండరాలు రవాణా, అమ్మకాలకు అనుమతి.
13. హాస్పిటల్స్, పెట్రోల్ బ్యాంకులు7, LPG గ్యాస్, ఆయిల్ ఏజెన్సీలకు అనుమతి ఉంటుంది.
14. భద్రత విభాగాలకు ప్రవేటు సెక్యూరిటీ అనుమతి.
15. ఎయిర్ పోర్టు సంబంధిత సేవలకు మినహాయింపు.
16. కలెక్టర్, RDO, మండల కార్యాలయాలు, పోలీసులు,
వైధ్య ఆరోగ్య విభాగాలు,ఫైర్, విద్యుత్, మంచి నీటి విభాగాలు,వ్యవసాయం, హార్టికల్చర్, పశు సంవర్ధక, ఎక్సైజ్, కమర్షియల్, వాణిజ్య పన్నులు, రవాణా,కాలుష్యం, తూనికలు, డ్రగ్ కంట్రోల్ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు
పని చేస్తాయి.
17. అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర శాఖలను విధులకు ఆదేశిస్తారు.
18. అంగన్ వాడీ మార్చి 31వరకు పూర్తిగా మూసివేయాలి.
19. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు ఆధ్వర్యంలో ఆదేశాల అమలు తీరు పర్యవేక్షణ చేయాలి.
20. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం-2005, అంటురోగుల నివారణ చట్టం-1897 ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలపై ఏ కోర్టులోను సవాల్ చేయడానికి వీలు లేదు.

వెజిటెబుల్, ఫ్రూట్స్, మిల్క్, చికెన్ అండ్ మటన్ షాపులు
బ్యాంక్, ఇన్సూరెన్స్ కార్యాలయాలు, ఏటీఎంలు
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా
ఇంటర్నెట్ సర్వీసులు
ఈ కామర్స్ ద్వారా ఫుడ్, మెడికల్ వస్తువుల డెలివరీ చేసే సంస్థలు
పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ సంస్థలు ఓపెన్ చేసి ఉంటాయి.

తెలంగాణ సర్కారు ఈ ఆదేశాలను జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, దేశంలోని లాక్ డౌన్ ఉన్న జిల్లాలు, పలు రాష్ట్రాల్లో
దాదాపుగా ఈ విధానమే పూర్తిగా అమలు అవుతోంది. ఏమి చేయరాదు ఏమి చేయాలి తెలుసుకుని జాగ్రత్తగా జనమంతా జీవించాలి. నిర్లక్ష్యం ఖరీదు మీ ప్రాణాలు మరవొద్దు.