మృత్యు ఘంటాలు మోగకుండా

మృత్యు ఘంటాలు మోగకుండా

మన దేశంలో జనాభా కారణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించాలంటే ఆత్రుత వద్దు ఆలోచనే ముద్దు.
మీ ప్రాణాలు చాలా విలువైనవి ఎన్ని కోట్లు ఇచ్చిన
మళ్లీ కొనలేం అలాగే ప్రకృతి వనరులు కూడా జాగ్రత్తగా పొదుపుగా వాడగలరు.

మన దేశ జనాభా 125కోట్లు ఎదురయ్యే సవాళ్లు.

1.మంచి నీరు సమస్య
2.మురుగునీటి సమస్య
2. అధిక జన సాంద్రత
4. పరిశుభ్రత లోపాలు
5. విద్యుత్ కొరత
6. మధ్య తరగతి జీవనం
7. ఆర్థిక స్తోమత అంతంతే
8. ఆరోగ్యం కోసం బడ్జెట్ లేమి
9. అత్యుధునిక వైద్య సేవలు కొరత
10. ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేకపోవడం.

అత్యాధునిక దేశాలే ఈ కరోన మహమ్మారి వైరస్ విజృంభించడంతో నిత్యావసర సేవలు, అత్యవసర సేవలు
అందుబాటులోకి తీసుకుని రాలేక లబోదిబోమంటున్నాయి.
అలాంటిది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోన్న దేశం అంతేకాక125కోట్ల అత్యధిక జనాభా నివసిస్తోన్న
ప్రదేశంలో కరోనా కేసుల నమోదు పెరిగితే అత్యవసరాలకు కొరత ఓ అతిపెద్ద సమస్య అవుతుంది. భూమ్మీద ధనిక దేశాలైన ఫ్రాన్స్,ఇటలీ, జర్మనీ, చైనా వంటి దేశాలే కరోనాతో పోరాడేందుకు చేతకావడం లేదు.

శ్రీ పోతులూరి వీరబ్రహ్మం చెప్పినట్లు కలికాలం కాస్తా పోయే కాలం దాపురించినట్టు మనం మసలకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అదేశాలు, మార్గదర్శకాలు, సూచనలు పాటించాలి. దేశంలో ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు
కొరత రాకుండా పాలకులు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీ వంతు సహాయం కూడా
మీరు చేయాలంటే మన ప్రకృతి వనరులు కాపాడాలి.