IAF చీతా హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్

కోవిడ్-19 పరీక్షల కోసం “లే” ప్రాంతానికి చెందిన నమూనాలను హిండన్ నుండి చండీగఢ్ తీసుకువెళ్తున్న ఓ చీతా హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హిండన్ నుండి సుమారు 3నాటికల్ మైళ్ళ దూరంలో సాంకేతిక లోపంతో ఔటర్ రింగు రోడ్డు రహదారిపై క్షేమంగా దిగింది. పైలెట్లు అప్రమత్తతో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి ఆస్థి నష్టం జరగలేదు. సహాయ ఎయిర్ క్రాఫ్ట్ వెంటనే హిండన్ నుండి వచ్చింది. హెలికాఫ్టర్ కు అవసరమైన మరమ్మత్తు చేసి తిరిగి హిండన్ కు క్షేమంగా తరలించారు.