అత్యవసర మెడిసిన్ తయారీ? అందుబాటులో?

కొవిడ్-19కు ముందు మరియు తరువాత ఔషధాల తయారీ స్థితిగతులపై 20 రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణాధికారులతో ఔషధ విభాగ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన మీడియో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్పిపిఏ, డిసిజి(ఐ) అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.

ఔషధ మరియు వైద్యపరికరాల కొరత లేకుండా స్థానిక పరిపాలన యంత్రాంగం మరియు తత్సంబంధిత అధికారుల సహాయ సహకారాలు మరియు అందరు ఔషధ నియంత్రణాధికారుల కృషిని ఫార్మసూటికల్ విభాగ కార్యదర్శి ప్రశంసించారు. కొవిడ్-19కు ముందు, తరువాత దేశంలో ఔషధాలు మరియు వైద్యపరికరాల తయారీ, లభ్యత శాతంపై సమీక్ష నిర్వహించారు. కొవిడ్-19 చికిత్సకు అవసరమైన ఔషధాలు మరియు వైద్యపరికరాల లభ్యతను సరిచూసుకొనవలసిందిగా రాష్ట్ర ఔషధ నియంత్రణాధికారులను కోరారు. అందుబాటులో ఉన్న ఔషధాలను మరియు వైద్యపరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవలసిందిగా కోరారు.

దేశంలో అవసరమైన వైద్యపరికరాలు మరియు ఔషధాలను లభ్యతను పెంచడానికి, తయారీకి పూర్తిస్థాలో తాము కృషి చేస్తున్నామని రాష్ట్ర ఔషధ నియంత్రణాధికారులు హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఔషధ నింత్రణాధికారులకు ఫార్మాసూటికల్ విభాగ కార్యదర్శి ఈ క్రింది ఆదేశాలను ఇచ్చారు. ఔషధాల లభ్యత పెంచేందుకు ఉత్పత్తిని శాతాన్ని పూర్తిస్థాయిలో పెంచాలి. ఉత్పత్తి మరియు సరఫరా సంబంధించిన సమస్యల పరిష్కారానికి, కార్మికులకు పనిలోనికి రావడానికి అనుమతులు, ఔషధాలు మరియు వైద్యపరికరాల తయారీ సంబంధిత అనుబంధ విభాల వంటివి మరియు స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలి.

ఔషధాలు మరియు వైద్యపరికరాల అక్రమ నిలవ మరియు ధరల నిర్ణయం వంటివి పర్యవేక్షించడం మరియు అటువంటి సమయాల్లో తగిన చర్యను తీసుకోవడం. అన్ని రాష్ట్రాలు ఔషధాలు మరియు వైద్యపరికరాల తయారీ విభాగాలకు చెందిన సమాచార సాఫ్ట్ కాపీని అత్యవసరంగా అందిచాలి. అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణాధికారులు హైడ్రాక్సీక్లోరోక్విన్, ఎరిత్రోమైసిన్ మరియు పారాసిట్రమల్ ల లభ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.