ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం విపత్కర పరిస్థితుల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన ప్రజలకు ప్రత్యేక పాసులు మంజూరు చేస్తోంది. ముఖ్యంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వ్యక్తులకు కోవిడ్-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని DGP కార్యాలయం సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో విడుదల చేసింది.
అత్యవసర పాసులు తీసుకోవాలనుకునే వ్యక్తులు ఇవ్వాల్సిన వివరాలు ఇలా ఉన్నాయి. 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్ కార్డు వివరాలు 3.ప్రయాణించే వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు పొందుపరచి సంబంధిత పోలీసు అధికారులకు పంపాలి. విచారణ తర్వాత పోలీసు అధికారులు పాసులు జారీచేస్తారు. దరఖాస్తు కోసం కోవిడ్-19 ఎమర్జెన్సీ పాసుల కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్ చేయాలి. జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీలు పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.