ఎమెర్జెన్సీలో ఆపద్భాంధవుడిలా వచ్చారు…

హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 26-04-2020 నాడు రాత్రి 8గంటల 20 నిమిషాలకు స్థానిక రాజు యాదవ్ (7330949308) అత్యవసరంగా ఓ ఫోన్ కాల్ చేసాడు.

గాంధీనగరులోని బన్సిలాల్ పేటలో ఓ గర్భిణీ మహిళ నొప్పులతో బాధపడుతోందని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్థానిక పోలీసులు హుటాహుటిన
పోలీస్ మొబైల్ కారులో సంఘటన స్థలంకు చేరుకుని ఆమెను
సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. గర్భిణీ స్త్రీని వైద్యులు పరీక్షించిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.