కరోనా కమిటీలు ఏంటీ? ఏమి చేస్తాయి?

నీతి ఆయోగ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సాధికార బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోవిడ్‌-19 సంబంధిత ప్రతిస్పందన కార్యాచరణ దిశగా ప్రైవేటు రంగం, స్వచ్ఛంద-అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం కోసం సాధికార బృందం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

1. సమస్యల గుర్తింపు: సమర్థ పరిష్కార‌-ప్రణాళికల రూప‌క‌ల్ప‌నలో ఎదుర‌వుతున్న చిక్కుల‌ను తొల‌గించ‌డం కోసం మూడు భాగస్వామ్య బృందాల‌ను క‌ల‌గ‌లిపి O.M No.40-3/2020/DM-I (A)తో 29/03/2020న సాధికార బృందం No.6. ఏర్పాటు చేయ‌బడింది. ఈ బృందంలో ఐక్యరాజ్యసమితి సంస్థలు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు పౌర సమాజ సంస్థలు, ప్రగతి భాగస్వాములు పారిశ్రామిక సంఘాలు- సీఐఐ, ఫిక్కి, అసోచామ్‌, నాస్కామ్‌ భాగస్వాములు కాగా, ఈ బృందానికి నీతి ఆయోగ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్‌ కాంత్‌ అధ్యక్షత వహిస్తారు. వివిధ సంస్థలకు చెందిన మరో 9మంది సభ్యులున్న ఈ సాధికార కమిటీ (EG6) కార్యకలాపాలకు నీతి ఆయోగ్‌ సలహాదారు (సుస్థిర ప్రగతి లక్ష్యాల విభాగం-SDG) సంయుక్త సమద్దార్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

2. ఆరు సమావేశాలు: ఈ బృందం ఈజీ6 మార్చి 30-ఏప్రిల్‌ 3 తేదీల మధ్య పారిశ్రామిక సంఘాలు, ఐవోలు, సీఎస్‌వోలతో ఆరు సమావేశాలు నిర్వహించింది.

3. అంతర్జాతీయ సంస్థలు: భారత్‌లో ఐక్యరాజ్య సమితి నివాస-సమన్వయకర్తతోపాటు వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన భారత విభాగాల అధిపతులతో చర్చలు నిర్వహించింది.

4. పౌర సమాజ సంస్థలు, ప్రగతి భాగస్వాములు: దేశంలోని వివిధ ప్రాంతాలు, సమాజాలకు చెందిన 40కిపైగా సంస్థలతో సమావేశాల్లో అనేక అంశాలపై లోతుగా చర్చించింది. అలాగే ‘దర్పణ్‌’లో నమోదైన 92,000 స్వచ్ఛంద/పౌరసమాజ సంస్థలకు రాసిన లేఖలో వివిధ అంశాల్లో ప్రభుత్వానికి తోడ్పాటునివ్వాలని నీతి ఆయోగ్‌ సీఈవో కోరారు. స్వచ్ఛంద-పౌర సమాజ సంస్థల వనరుల వినియోగంపై స్థానిక సంస్థలకు ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో సూచించారు.

5. పారిశ్రామిక సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులు: సీఐఐ, ఫిక్కి, అసోచామ్‌, నాస్కామ్‌సహా వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఈజీ6 సమావేశమైన అనేకానేక అంశాలపై విస్తృతంగా చర్చించింది. ప్రభుత్వం ఇప్పటిదాకా చేపట్టిన వివిధ చర్యలను వివరించి, ఆయా రంగాల్లో తమవంతు కర్తవ్యం నిర్వహించాలని కోరింది.