ప్రజలకు మాధ్యమం ఎంపిక ప్రాథమిక స్వేచ్ఛ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంగ్ల మాధ్యమంపై ఉత్తర్వులను రద్దు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85ను కోర్టు రద్దు
చేస్తూ తీర్పు వెలువరించింది.

ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా, ఏకపక్షంగా ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని హైకోర్టు తేల్చింది. దీన్ని BJP నేతలందరూ స్వాగతిస్తున్నాం. చదువులో భాష ఎంపిక అన్నది విద్యార్థులు, తల్లిదండ్రులకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ. ప్రాథమిక హక్కుల ప్రకరణ 21 ద్వారా ప్రజలకు జీవించే హక్కుతో పాటు.. దేశంలో ఎలా మనగలగాలన్నది ఇందులో అంతర్భాగం. మేము ఆంగ్ల బాషా మాధ్యమంకు వ్యతిరేకం కాదు కానీ తెలుగు మాధ్యమ రద్దుకు వ్యతిరేకం. ఈ న్యాయపోరాటంలో నేను భాగస్వామిని అయినందుకు చాలా గర్వంగా ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు.

గతంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పొక్రియల్ దృష్టికి తీసుకెళ్లగా ఆరోజే ఈ నిర్బంధ GOలు చెల్లవని కోర్టు దృష్టికి వెళితే తక్షణమే రద్దు చేస్తారని BJP విజయవాడ పార్లమెంటరీ కార్యదర్శి కిలారు దిలీప్ గుర్తు చేశారు.