పింఛనర్ల‌కు ఈపీఎఫ్ఓ శుభవార్త

ఈపీఎఫ్ఓ తన పెన్షన్ పథకం కింద 65 లక్షల మంది పెన్షనర్లను కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు గాను లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలోనూ పెన్షనర్లకు అసౌకర్యాన్ని నివారించే దిశ‌గా ఈపీఎఫ్ఓ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

త‌న మొత్తం 135 ఫీల్డ్ ఆఫీసులు ద్వారా ఏప్రిల్‌, 2020కి సంబంధించిన పెన్ష‌న్ల‌ను ముందుగానే ప్రాసెస్ చేసింది. భారతదేశం అంతటా విస్త‌రించి ఉన్న పెన్ష‌న్ల‌ పంపిణీ నోడల్ బ్యాంక్‌ శాఖ‌ల‌కు దాదాపు రూ.764 కోట్ల మేర పెన్ష‌న్ సొమ్మును స‌కాలంలో చేర‌వేసేందుకు వీలుగా దాదాపు ఈపీఎఫ్ఓ అధికారులు, సిబ్బంది అనునిత్యం అహ‌ర్నిష‌‌లు కృషి చేశారు. దీనికి తోడు షెడ్యూల్ ప్రకారం పెన్షనర్ల ఖాతాల్లో పెన్షన్ సొమ్ము క్రెడిట్ అయ్యేలా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్ని బ్యాంక్ శాఖలనూ ఈపీఎఫ్ఓ ఆదేశించింది. కోవిడ్ -19 వైర‌స్ సంక్షోభపు సమయంలో పింఛనుదారులకు సహాయం చేయ‌డం ప్ర‌స్తుత త‌రుణంలో త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌ని ఈపీఎఫ్ఓ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ఈపీఎఫ్ఓ చేత స‌కాలంలో పింఛన్‌ను క్రెడిట్ చేసేందుకు గాను అధిక ప్రాధాన్యతను ఇస్తూ చ‌ర్య‌లు చేప‌ట్టింది.