PF DoB మార్చుకోవాలా? త్వరపడండి.

కోవిడ్-19 మహామ్మారి నేపథ్యంలో ఆన్ లైన్ సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో
PF సభ్యులు, EPFO రికార్డుల్లో పుట్టిన రోజును సరిదిద్దుకునేందుకు EPFO అవకాశం కల్పించింది. క్షేత్ర స్థాయి కార్యాలయాలకు సవరించిన సూచనలను జారీ చేసింది. దీంతో UAN/KYC పిర్యాదు అవుతుంది. రెండు తేదీల మధ్య తేడా మూడు సంవత్సరాలకంటే తక్కువగా ఉన్నట్లయితే, పుట్టిన రోజును సరిదిద్దడం కోసం, ఆధార్ కార్దులో నమోదైన పుట్టిన రోజును ఇప్పుడు చెల్లుబాటయ్యే రుజువుగా అంగీకరించడం జరుగుతుంది. PF చందాదారులు తమ సవరణ విజ్ఞప్తిని ఆన్ లైన్ లో దాఖలు చేయవచ్చు. సభ్యుల పుట్టిన రోజును EPFO తక్షణమే UIDAIతో ఆన్ లైన్ లో ధృవీకరించుకోవడానికి వీలు కలుగుతుంది. తద్వారా, సవరణ విజ్ఞప్తులను పరిశీలించి, ధృవీకరించడానికి పట్టే సమయం తగ్గుతుంది. PF సభ్యుల ఆన్ లైన్ విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని EPFO తన క్షేత్ర స్థాయి కార్యాలయాలను ఆదేశించింది. తద్వారా, కోవిడ్-19 మహమ్మారి విజృంభణ కారణంగా ఆర్ధిక సంక్షోభంలో ఉన్న PF చందాదారులు, తమ PF ఖాతాలో జమ అయిన మొత్తాల నుండి తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్సు (నాన్-రిఫండబుల్ అడ్వాన్స్) కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి వీలు కలుగుతుంది.