ఆదిలాబాద్ సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష

ఆదిలాబాద్ సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.. 62 రోజుల దర్యాప్తు, విచారణ లో మొత్తం 25 మంది సాక్షులను కోర్టువారు విచారించినానంతరం తీర్పు వెలువరించారు.. తుది తీర్పు సందర్భంగా నిందితులైన షేఖ్ బాబు, షేఖ్ షాబొద్దీన్, షేఖ్ మఖ్ధూం . కాగా.. ఇది చాలా తీవ్రమైన నేరమనిపేర్కొన్న జిల్లాజడ్జ్ 302 (రెడ్ విథ్ 34 IPC) , 376(D) సెక్షన్ల ప్రకారం నిందితులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు..

కాగా ఘటనా సమయంలో మృతురాలి వద్దనుండి సెల్ ఫోన్, 200 రూ. లు అపహరించినందుకుగాను నిందితులు ముగ్గురికీ కలిపి రూ.26 వేల జరిమానా, ఒక్కొక్కరికి 3 సంవత్సరాల జైలుశిక్ష కూడా విధించినప్పటికీ.. వీటన్నింటికంటే పెద్దదైన ఉరిశిక్షనే ప్రధానమైనదిగా పరిగణించాల్సి ఉంటుందని PP రమణారెడ్డి పేర్కొన్నారు.. ఇదిలా ఉండగా.. ఈ తీర్పుపట్ల హర్షం వ్యక్తంచేసిన మృతురాలి భర్త గోపీ కోర్ట్ వద్ద ఆసిఫాబాద్ జిల్లా SP మల్లారెడ్డి కాళ్ళపై పడి కన్నీరు పెట్టుకున్నారు.. ఈ తీర్పు తన భార్య ఆత్మకు శాంతికలిగిస్తుందని, న్యాయ వ్యవస్థ పై తమ నమ్మకాన్ని మరింత పెంచిదని గోపి పేర్కొన్నారు