నటన నచ్చింది- సినిమా ఓడింది. బట్టలు చించుడు తగ్గించాలే Mr. దేవరకొండ

నటన నచ్చింది- సినిమా ఓడింది.
ఇక తాగుడు, బట్టలిప్పుడు ఆపు విజయ్.
దేవరకొండకు అభిమాని బహిరంగ లేఖ.
పెళ్లి చూపుల్లో నచ్చావ్.. అర్జున్ రెడ్డిలో మెప్పించావ్.. గీత గోవిందమ్ లో నవ్వించావ్.. ఎవడే సుబ్రమణ్యం, నోటా ఇలా నువ్వేది తీసినా, చూశాం. మన వాళ్లకు చూపించాం.. దేవరకొండ మావాడేరా అని ఓన్ చేసుకున్నాం. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా, సినీ ఫీల్డ్ లో గాడ్ ఫాదర్లు లేకున్నా.. నిలదొక్కుకున్న నిన్ను చూసి గర్వపడ్డాం. కానీ నీ వరల్డ్ ఫేమస్ లవర్ చూశాక. నువ్వు సిక్స్ కొట్టుడేమో గానీ, మేం డిఫెన్స్ లో పడ్డాం. డియర్ కామ్రెడ్ .. బీ సెలక్టివ్.. నువ్వు ఇప్పుడున్న స్థానంలో ఉన్నా నిన్ను ఆదరిస్తాం. కానీ ఇంకా దిగజారకు. అసలే కొత్త ఆలోచనలు లేక, ఉన్నవాళ్లను ఇండస్ట్రీలోకి రానియ్యక, వచ్చిన వాళ్లను తొక్కెయ్యడం చూశాక.. నువ్వే మా యూత్ ఐకన్. డిఫరెంట్ స్టోరీలు, టేకింగ్ లు, నీ నటనా విరుపులకు మేం ఫిదా అయ్యాం.

దేవరకొండలో మంచి నటుడు ఉన్నాడ్రా.. మన వీఢి పోరడే అన్నంతలా ఓన్ చేసుకున్నాం. అమెజాన్ ప్రైమ్ పుణ్యమా అని ఒక అసురన్, ఒక హెలెన్ లాంటి పరభాషా చిన్న సినిమాలు చూసి మనల్ని మనమే తిట్టుకోవాల్సిన పరిస్థితి. సంక్రాంతి పేరు మీద వచ్చిన రెండు పెద్ద సినిమాలు కూడా ఫక్తు కమర్షియల్ పేరుతో వాళ్లకు వాళ్లు హిట్ చేసుకున్నవే తప్ప, సినిమా అభిమానిగా ఆరెండు సినిమాలను పైన చెప్పిన అసురన్, హెలెన్ తో పోల్చుకుని బాధపడ్డా. మన తెలుగులో కూడా చిన్నాచితకా ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఏజెంట్ సాయి ఆత్రేయ, బ్రోచేవారెవరురా, ఎవరు లాంటి సినిమాలు చూసి అబ్బా మనవాళ్లు ప్రయోగాలు చేస్తున్నారని ఆనందించాం. అదే సమయంలో బాలయ్య బాబు పిడిగుద్దులు తప్పించుకునేందుకు ఇంకా పాట్లు పడుతూనే ఉన్నాం. అయ్యా దేవరకొండా.. నీ అభిమానిగా చెప్పొచ్చేదొక్కటే .. నువ్వూ ఆ తాను ముక్కవే లే అనేంత లైట్ నిన్ను మేం తీసుకోలేం. ఎందుకంటే ఓన్ చేసుకున్నాం కాబట్టి. అందుకే పోయిందేమీ లేదు. వరల్డ్ ఫేమస్ కాకపోయినా, నువ్వ మా గల్లీ పోరడివే అన్నంత అభిమానిగా నిన్ను చూసుకునేందుకు మేమున్నాం. కానీ మల్లోసారి ఆ దిక్కు మాలిన ప్రేమ, విరహం, బట్టలిప్పుకు తిరుగుడు, తాగుడు లాంటి పిచ్చి సినిమాలకు ఇక ఫుల్ స్టాఫ్ పెట్టు. నీలో మంచి యాక్టర్ ఉన్నాడు.. నీ చుట్టూ మంచి టీమ్ కూడా ఉంది. నిన్ను అభిమానించేందుకు మేమూ ఉన్నాం. కాబట్టి థింక్ డిఫరెంట్. ఆ ఫక్తు తెలుగు సినిమా ముఠాలో దూరి నిన్ను నువ్వు కోల్పోయి, మేం బాధపడేలా చెయ్యకు. ఈ రొచ్చులో నువ్వు వేరు, ఈ పీస్ మా పీస్ అని మేము గర్వంగా చెప్పుకునేలా మాత్రమే ఉండు. చెత్త సినిమాలు పది తీస్తే నీకు, నీ టీమ్ కు పైసలు వస్తాయేమో, కానీ నిన్ను ఓన్ చేసుకున్న మేం మాత్రం ఓడిపోతామ్. అందుకే ఇలాంటి పిచ్చి సినిమాలు ఇక బంద్ అంటూ నువ్వు చెప్పిన మాట మీద నువ్వే నిలబడు. మమ్నల్ని మళ్లీ బద్నామ్ చేయకు.

ఇట్లు..దేవరకొండ విజయ్ వీరాభిమాని