నష్టం గురించి పవన్ కల్యాణ్‌కు వివరించిన రైతులు  

నష్టం గురించి పవన్ కల్యాణ్‌కు వివరించిన రైతులు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి కంకిపాడు మీదుగా కృష్ణా జిల్లా వెళ్లి అక్కడి పలు ప్రాంతాల్లో పంటలను పరిశీలిస్తున్నారు. ఆయన వెంట జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.నివర్ తుపాను ధాటికి ఏపీ రైతులు నష్టపోయిన పంటలను పరిశీలించి, వారితో చర్చించడానికి పవన్ కల్యాణ్ ఈ పర్యటన జరుపుతున్నారు. పంటలను ఏ మేరకు నష్టపోయామన్న విషయం గురించి రైతులు ఆయనకు వివరిస్తున్నారు. మరోపక్క, పవన్ కల్యాణ్‌ను చూడడానికి స్థానిక జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ మీదుగా భట్టిప్రోలు చావలి, తెనాలిలో ఈ పర్యటన కొనసాగుతోంది.