దేశంలో ఆహార కొరత ఉండదు: FCI

కోవిడ్-19 వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా నిరంతరాయంగా ఆహారధాన్యాల సరఫరాకు FCI సిద్ధంగా ఉంది. మార్చి 24వ తేదీన లాక్ డౌన్ ప్రారంభమైన రోజు నుండి ఇంతవరకు మొత్తం 477 గూడ్స్ వ్యాగన్లలో సుమారు 13.36 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల రవాణా; ఈ రోజు 69 గూడ్స్ వ్యాగన్లలో రవాణా చేసింది.

 

లాక్ డౌన్ సమయంలో భారత ఆహార సంస్థ (FCI) దేశవ్యాప్తంగా నిరంతరాయంగా గోధుమలు, బియ్యం సరఫరా చేస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద ఆహార ధాన్యాల అవసరాలతో పాటు, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 81.35 కోట్ల మంది ప్రజలకు వచ్చే మూడు నెలలకు ఒక్కో వ్యక్తికీ 5కేజీల చొప్పున అవసరమైన అదనపు డిమాండ్ ను కూడా పూర్తిగా తీర్చడానికి FCI సిద్ధంగా ఉంది. 2020 ఏప్రిల్ 2వ తేదీనాటికి FCI వద్ద 56.24 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. అందులో 30.64 మెట్రిక్ టన్నుల బియ్యం, 24.6 మెట్రిక్ టన్నుల గోధుమలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా గోధుమలు, బియ్యం రవాణాను ఎక్కువగా గూడ్స్ రైళ్ల ద్వారా రవాణా చేయడం ద్వారా,ఆహారధాన్యాలకు పెరుగుతున్న డిమాండ్ ను తీర్చే పరిస్థితిలో ఎఫ్.సి.ఐ. ఉంది. ఈ రోజు, 2020 ఏప్రిల్ 3వ తేదీన మొత్తం 69 గూడ్స్ రైలు వ్యాగెన్లలో సుమారు 1.93 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రవాణా చేయడం జరిగింది. లాక్ డౌన్ ప్రారంభమైన 2020 మార్చి 24వ తేదీ నుండీ ఎఫ్.సి.ఐ. 477 గూడ్సు రైలు వ్యాగెన్లలో సుమారు 13.36 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఎఫ్.సి.ఐ. రవాణా చేసింది