అగ్ని ప్రమాదం అదుపులో మంటలు

హైదరాబాద్ నగరంలోని బ్యాంక్ స్ట్రీట్ కోఠిలోని మిథిలా కాంప్లెక్స్ అండ్ పటిదార్ సమాజ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఎటువంటి షాప్స్ కూడా లేవు అందుకే బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి. కానీ అనుకోకుండా ఈ బిల్డింగ్ పైన చివరి రూములో అగ్ని ప్రమాదం జరిగింది అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. అగ్నిప్రమాదం జరిగిన రూములో విలువైన సామాన్లు లేకపోవడంతో ఆస్తి నష్టం కూడా జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.