వైద్యురాలి సేవలకు పూల వర్షంలో ముంచేశారు.

కరోనా మహామ్మారిని అరికట్టేందుకు వైద్యురాలిగా తనవంతు కర్తవ్యాన్ని ICU ఎమెర్జెన్సీ వార్డులో నిర్వర్తించి సాదాసీదాగా ఇంటికి వచ్చిన ఓ మహిళ డాక్టరును కుటుంబ సభ్యులు, స్నేహితులు, అపార్ట్ మెంటులో నివాసముంటున్న ఇరుగుపొరుగు పూల వర్షంతో స్వాగతం పలికారు. దీంతో ఈ భావోద్వేగ సంఘటనలో ఆ మహిళ డాక్టరు ఆనంద బాష్పలతో కంటతడి పెట్టుకుంది.