అన్నం పరబ్రహ్మ స్వరూపం

కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా నిరుపేదలకు కనీసం ఆహారం అందటం మహా భాగ్యమైంది. దీంతో అనంతపురం కేంద్రంలో ఆకలితో ఆహారం లభ్యమవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లందరికీ పట్టడన్నం పెట్టేందుకు
నాగేంద్ర అనే ఓ జర్నలిస్టు సామాజిక బాధ్యతతో సేవలు అందిస్తున్నారు. ఈ ఆహార సరఫరాలో YSRCP అనంతపురం జిల్లా మైనారిటీ సెల్ జనరల్ సెక్రెటరీ సయ్యద్ జావిద్ ఆధ్వర్యంలో రోడ్ల మీద నివసించే అనాధలకు, వైద్యం కోసం గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు, విధులు నిర్వహిస్తోన్న పోలీసులు మరియు శానిటేషన్ వర్కర్స్
అందరికి ఆహారం అందించడం జరిగింది.