మార్కెట్ సామాజిక దూరం భేష్

తెలంగాణ సిద్ధిపేట మార్కెట్ యార్డులో పని చేసే 500
మంది హామాలీలకు సుధా నారాయణ మూర్తి సహకారంతో నిత్యావసర సరుకుల కిట్స్ మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. కరోనా అనే కొత్త రోగం ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మనుషులు ఇండ్లలో ఉంటే జంతువులు రోడ్లపై ఆడుతున్నాయి. కరోనా రోగానికి మందు లేదు. మందు అంటే కేవలం ఎవరి ఇండ్లలో వారు ఉండడమే. సీఏం కేసీఆర్ ప్రజలను ఎక్కడి వారిని అక్కడే ఉండమని సూచిస్తున్నారు. మన దేశం, మన రాష్ట్రం ఇప్పటికే సేఫ్ జోన్ లోనే ఉన్నది. అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో శవాలు గుట్టల్లా పెరుగుతున్నాయి. కరోనాతో చనిపోయిన శవం దగ్గరకు కన్నవారు, కట్టుకున్న వారు పోలేని పరిస్థితి నెలకొంది. మనిషిని మనిషి తాకితేనే ఈ రోగం వస్తుంది. అవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దు.

కొద్దిరోజులు ఓపిక పడితే ఈ రోగం బాధ మనకు తప్పుతుంది. సింగపూర్ వంటి దేశం ఒక నెల రోజులు లాక్ డౌన్ పాటిస్తుందని, అలాంటి పరిస్థితి రావద్దు అంటే మనమంతా ఇంట్లోనే ఉండాలి. ఢిల్లీలోని మర్కజ్ మీటింగ్ పోయి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాం.
ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి., కానీ బయట తిరిగి రోగాన్ని కొని తెచ్చుకోవద్దు. సిద్దిపేటలో ఒక్కరికీ కూడా కరోనా రాలేదు. కరోనాకు కులం, మతం, చిన్నా, పెద్ద తేడా లేదు భయనకమైన వైరస్. స్పెయిన్ దేశ రాణి కరోనాతో మృతి చెందింది. ప్రజలంతా సామాజిక దూరం పాటించి, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.