పాపులర్ నెంబర్ 040-21111111

కరోనా మహామ్మారిని అరికట్టేందుకు మనమందరం ఇంటికే పరిమితం అవ్వాలని, ఈ సందర్భంలో ఆకలితో ఎవరు అలమటించకుండా ఉండేందుకు ఆహారం సప్లయి కోసం “040-21111111” సంఖ్యను పాపులర్ చేయాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేసారు.

జంట నగరాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆహారం అవసరమయ్యే ఎవరైనా ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు, ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ “040-21111111” నెంబరును అందుబాటులోకి తీసుకుని వచ్చారని, అందరూ ఈ సంఖ్యను ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలని ఆమె కోరారు.