ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే యాచేంద్ర సాయికృష్ణ నియామకం

ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే యాచేంద్ర సాయికృష్ణ నియామకం

ఆధ్యాత్మిక ప్రచారం కోసం, శ్రీవారి సేవల ప్రసారాల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే వీబీ సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాలంలో ఎస్వీబీసీ చుట్టూ వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.వైసీపీ అధికారంలోకి వచ్చాక సినీ నటుడు పృథ్విని ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమించారు. అయితే, ఒక మహిళతో ఆయన అసభ్యకర రీతిలో వ్యవహరించినట్టు ఆరోపణలు రావడంతో… ప్రభుత్వం ఆయనను ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాగనంపింది. ఆ తర్వాత అయోధ్య రామమందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయకపోవడంతో నలువైపుల నుంచి ఎస్వీబీసీ విమర్శలను ఎదుర్కొంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో యాచేంద్ర బాధ్యతలను చేపట్టారు.