మే16 నుంచి ఉచిత బియ్యం,రేషన్ పంపిణీ

ఏపీలో నాలుగో విడ‌త రేష‌న్ స‌ర‌ఫ‌రాకు స‌ర్వం సిద్ధం
ప‌ద‌మూడు జిల్లాల్లో మొత్తం ల‌బ్దిదారులు 1, 48,05,879 కుటుంబాలు, చౌక‌ధ‌ర‌ల దుకాణాలు మొత్తం: 28, 354
అర్హ‌త ఉండి కార్డులేని వాళ్ల‌కు సైతం రేష‌న్ పంపిణీ
ఉచితంగా బియ్యం, కందిప‌ప్పు పంపిణీ.


– లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నులు చేయ‌కోలేని పేద‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 16 నుంచి నాలుగో విడ‌త రేష‌న్ పంపిణికీ ఏపీ ప్ర‌భుత్వం స‌ర్వం సిద్ధం చేసింది. రేషన్ దుకాణాల ద్వారా ప్రతి బియ్యంకార్డుకు కేజీ శనగలు, కార్డులోని ప్రతి సభ్యుడికి అయిదు కేజీల చొప్పున బియ్యంను ఉచితంగా అందించనున్నారు. పద మూడు జిల్లాల్లోని 28,354 చౌకదుకాణాల ద్వారా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు అందించనున్నారు. అర్హత వుండి, బియ్యంకార్డు లేని పేద కుటుంబాలకు కూడా ఉచితంగా రేషన్ అందించాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో కొత్తగా 81,862 కుటుంబాలకు మూడో విడత నుంచి ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సారి కూడా అర్హులైన ఈ పేద కుటుంబాలకు ఉచిత రేషన్ అందించ‌నున్నారు. దీంతో నాలుగో విడతలో మొత్తం 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే సివిల్ సప్లయిస్ అధికారులు అన్ని చౌకదుకాణాలకు బియ్యం, శనగలు రవాణా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతికదూరంను పాటించాలన్న నిబంధనల మేరకు, రేషన్ దుకాణాల వద్ద గుంపులుగా ఏర్పడకుండా వుండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంది. కొన్నిచోట్ల రేషన్ కోసం కార్డుదారులు తొందరపడి ఒకేసారి దుకాణాల వద్దకు వచ్చిన పరిస్థితిని గమనించి ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా సమయం, తేదీతో కూడిన కూపన్లను ముద్రించింది. వాలంటీర్ల ద్వారా ఈ కూపన్లను బియ్యం కార్డుదారులకు అందిస్తున్నారు. ఈ కూపన్లపై వారికి కేటాయించిన రేషన్ షాప్ లో ఏ తేదీలో, ఏ సమయానికి వారు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చో నిర్ధేశించారు.

జిల్లాల వారీగా ల‌బ్దిదారులు వీరే..:
జిల్లా చౌకదుకాణాలు మొత్తం రైస్ కార్డులు
పశ్చిమగోదావరి 2,211 12,59,925
చిత్తూరు 2,901 11,33,535
నెల్లూరు 1,895 9,04,220
తూర్పు గోదావరి 2,622 16,50,254
కృష్ణా 2,330 12,92,937
ప్రకాశం 2,151 9,91,822
గుంటూరు 2,802 14,89,439
వైఎస్ఆర్ కడప 1,737 8,02,039
విశాఖపట్నం 2,179 12,4,5266
విజయనగరం 1,404 7,10,528
శ్రీకాకుళం 2,013 8,29,024
కర్నూలు 2,363 11,91,344
అనంతపురం 3,012 12,23,684
కొత్తగా గుర్తించిన అర్హత వున్న కుటుంబాలు : 81,862