కరోనా కట్టడికి జస్టీస్ NV. రమణ విరాళం

ప్రధానమంత్రి, ఏపీ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు వేర్వేరుగా లక్షరూపాయలు విరాళం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ NV రమణ అందజేశారు.
ఈ చెక్కు ప్రతులను ఏపీ భవన్ అధికారులు రవిశంకర్, దేవేందర్, TS అధికారి రామ్మోహన్ లకు జస్టీస్ NV రమణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ NV. రమణ మాట్లాడుతూ కరోనా వైరస్ దేశంలో ప్రబలుతోన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసారు. దేశ ప్రజలందరూ అప్రమత్తతో జాగ్రత్తగా వుండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తప్పకుండా పాటించాలని కోరారు.