గద్వాలలో డ్రాగన్ ఊహాన్ లాక్ సిస్టమ్…

పాత పాలమూరు జిల్లా గద్వాల పట్టణంలో ఇండ్లకు మున్సిపల్ సిబ్బంది తాళాలు వేశారు. చైనాలోని ఊహాన్ నగరంలో కరోనా అనుమానితులను ఇళ్లలోనే బంది చేసి తాళాలు వేసినట్టు గద్వాల పట్టణంలోని రాంనగర్ కాలనీలో కరోన పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి పరిసరాల్లో దాదాపు 10 ఇళ్లకు అధికారులు తాళాలేసేసారు.


సొంతిల్లే బందీఖానాలా..
కరోనా మహామ్మారి ప్రబలకుండా RED ZONE ఏరియాల్లో నివసిస్తోన్న కుటుంబాల ఇళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మార్గదర్శకాలు అతిక్రమిస్తే మాత్రం జనం బయటకు రాకుండా చైనాలోని ఊహాన్ నగరం స్టయిల్లో తాళాలు బిగిస్తున్నారు.

కర్నూలు నుంచి కృష్ణా ఒడ్డు వరకు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నడిగడ్డ లబోదిబోమంటోంది. రాయలసీమ సరిహద్దు అలంపూర్ నుంచి శాంతి నగర్, అయిజ, గద్వాల ఇలా తుంగభద్ర నది నుంచి కృష్ణా ఒడ్డు వరకు కోవిడ్19 ప్రజలను భయం భయంతో బెంబే లెత్తిస్తోతోంది. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్
మరణం ఆ తర్వాత 46 మందికి సోకింది. గద్వాల పట్టణంలో అధికంగా ఉన్న ప్రాంతాలైన రాంనగర్, మెూహల, పాత హౌసింగ్ బోర్డ్, గంజిపేట కాలనీల్లో పోలీసులు, మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో తాళాలు వేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో మాటలు పక్కనబెట్టి చేతల్లో రంగంలోకి దిగారు. అందుకే తక్షణ కర్తవ్యంగా ఇళ్లకు తాళాలు వేసేసారు.

ఈ ఇంట్లోని వ్యక్తులకు కావాల్సిన అత్యవసర సరుకులు, కూరగాయలు అన్నింటిని ఇంటికే అధికారులు తీసుకుని వచ్చి ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికి సొంతిట్లోనే బందీలుగా ఉండాల్సి రావడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో నుంచి భయటకు వస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు.