స్వచ్ఛతకు మారుపేరే “కరోనా”

 

జలం జీవనాధారం అంటారు. ప్రకృతి ప్రసాదించిన వరంలో జలం కూడా భాగమే. మన తాత ముత్తాతల కాలం నుంచి ఉచితంగా, శుభ్రంగా నీరు మనకు అందుబాటులో ఉండేది. తాగడానికైనా సాగుకైనా జలం లేనిదే జీవమే ఉండదు. అలాంటి అత్యావసర జలాన్ని ఇన్నాళ్లు మనం కాలుష్యంలో ముంచి తేల్చాము.

అంతే కాదండోయ్ స్వచ్ఛమైన నీళ్ల కోసం పదులు, ఇరభై, వందల రూపాయల డబ్బులు వెచ్చించి కోనుక్కొనే గతికి స్థితికి దిగజరిపోయాం. కానీ కరోనా మహామ్మారి కారణంగా దేశంలోని నదులన్నీ శశ్యశ్యామలంగా, తేట తెల్లని నీళ్లతో గలగల పారుతున్నాయి. అందుకు నిదర్శనం ఉత్తరాన గంగానది నుంచి CM KCR పుణ్యమా మన తెలంగాణ పల్లెల్లో కాళేశ్వరం కారణంగా పారుతోన్న గోదారమ్మ వరకు మనం ప్రస్తుతం చూడవచ్చు.

 

రాజ్యసభ MP సంతోష్ కూడా నదుల్లో జలం స్వచ్ఛంగా పారుతోన్న దృశ్యాలను చూసి పరవశించిపోతున్నామని ట్వీట్ చేశారు.