అస్పృశ్యత, లింగ వివక్షత విడనాడలి

12వ శతాబ్దపు సంఘ సంస్కర్త, తత్వవేత్త, సాహితీవేత్త శ్రీ బసవేశ్వరుడి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సమాజంలోని అస్పృశ్యత, లింగ వివక్షతకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడంలో వారు చేసిన కృషి, బోధనలు నేటికీ అనుసరణీయం.

వారు స్థాపించిన ‘అనుభవ మండపం’.. సమాజంలోని అన్ని వర్గాల వారు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఓ వేదికగా మారింది. దేహమే దేవాలయమని, శ్రమను మించిన సౌందర్యం లేదని.. కూడు, గూడు, గుడ్డతోపాటు జ్ఞానం, వైద్యం కూడా మానవుని కనీస హక్కులని వారు చేసిన బోధనలనుంచి నేటి సమాజం ప్రేరణ పొందాలి.