దాతలకు దండాలు GHMC

జంట నగరాల్లో ఆహార ప‌దార్థాల‌ను,బియ్యాన్ని ఇత‌ర వ‌స్తువుల‌ను నేరుగా పంపిణీ చేయాలనుకుంటోన్న దాత‌లు బియ్యం, ఆహార ప్యాకెట్ల‌ను అంద‌జేసేందుకు ట్విట్ట‌ర్ twitter@PDUCD_GHMC ఖాతా లేదా సెల్ నెం: 94931 20244, and 70939 06449 నెంబర్లలను సంప్ర‌దించాలి. GHMC ప్రకటన

లాక్‌డౌన్ నేప‌థ్యంలో పేద‌లు, కూలీల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వంతో పాటు వివిధ సంస్థ‌లు, వ్య‌క్తులు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ఆహార ప్యాకెట్ల‌ను, బియ్యాన్ని విరాళంగా అందిస్తున్నారు. అయితే ఉద్దేశం మంచిదైన‌ప్ప‌టికీ సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డం వ‌ల‌న బియ్యం, ఆహార ప్యాకెట్ల‌ కోసం వంద‌ల సంఖ్య‌లో ఒకే చోట ప్ర‌జ‌లు గుమికూడ‌టంతో క‌రోనా వైర‌స్ వ్యాపించే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపారు. దానిని నివారించుట‌కు దాత‌ల నుండి బియ్యం, ఆహారంను సేక‌రించుట‌కై GHMC అద‌న‌పు క‌మిష‌న‌ర్ ప్రియాంక ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

 

న‌గ‌ర వ్యాప్తంగా ప‌ది మొబైల్ వాహ‌నాల ద్వారా దాత‌ల నుండి ఆహారం, బియ్యాన్ని సేక‌రించి అవ‌స‌ర‌మైన ప్ర‌జ‌ల‌కు జిహెచ్‌ఎంసి ద్వారానే పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుత లాక్‌డౌన్ స‌మ‌యంలో గ‌త వారం రోజుల నుండి ఎన్‌.జి.ఓ.స్, దాత‌లు నేరుగా భోజ‌నం ప్యాకెట్ల‌ను, నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను పంచ‌డం జ‌రుగుతున్న‌ది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ డిస్టెన్స్ ఎవ‌రూ పాటించ‌డం లేదు. దీని వ‌ల‌న క‌రోనా వైర‌స్ వ్యాపించే అవ‌కాశం ఉన్న‌ది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టుట‌కై జిహెచ్‌ఎంసిలో సెంట్ర‌లైజ్‌డ్ వింగ్ ద్వారా మాత్ర‌మే బియ్యం, ఆహారాన్ని దాత‌ల నుండి సేక‌రించి, పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంది. ఇక నుండి జిహెచ్‌ఎంసిలో నెల‌కోల్పిన సెంట్ర‌లైజ్‌డ్ వింగ్‌కు స‌మాచారం ఇస్తే మొబైల్ వాహ‌నాల ద్వారా అధికారులే సేక‌రించి, పంపిణీ చేస్తార‌ని తెలిపారు. ఆహార ప‌దార్థాల‌ను, బియ్యాన్ని ఇత‌ర వ‌స్తువుల‌ను నేరుగా పంపిణీ చేస్తే సంబంధిత దాత‌లు, వ్య‌క్తుల‌పై ప్ర‌భుత్వ ప‌రంగా తీవ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు హెచ్చ‌రించారు. ఇక నుండి దాత‌లు బియ్యం, ఆహార ప్యాకెట్ల‌ను అంద‌జేసేందుకు ట్విట్ట‌ర్ twitter@PDUCD_GHMC ఖాతా లేదా సెల్ నెం: 94931 20244, and 70939 06449 ల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు. అలాగే తాత్కాలిక షెల్ట‌ర్ హోమ్‌ల‌లో ఉంచిన వ‌ల‌స కార్మికులు, నిరాశ్ర‌యులు, అనాథ‌ల‌కు మాస్కులు, ఇత‌ర వ‌స్తువుల‌ను పంపిణీ చేయుట‌కై జిహెచ్‌ఎంసి ప్ర‌త్యేక విభాగాన్ని సంప్ర‌దించ‌వ‌చ్చున‌ని మేయ‌ర్ తెలిపారు.