అమ్మాయిలు అబ్బాయిలతో సమాన వయస్సులో పెళ్లిళ్లు.. కేంద్రం నిర్ణయం

అమ్మాయిలు అబ్బాయిలతో సమాన వయస్సులో పెళ్లిళ్లు.. కేంద్రం నిర్ణయం

అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా 21 ఏళ్లు దాటితేనే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది..మహిళల వివాహ వయసును 21కి పెంచూతు టాస్క్‌ఫోర్స్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది.

పురుషుల వివాహ వయస్సును మాత్రం అలాగే ఉంచారు…మన దేశంలో మహిళల వివాహ కనీస వయసును పెంచాల్సిన అవసరం ఉందని 2020 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పారు. ఆ దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం దీనిపై అధ్యయానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.సమతా పార్టీ మాజీ సభ్యురాలు, టాస్క్‌ఫోర్స్ అధ్యక్షురాలు జయ జైట్లీ ఏడాది కాలంగా దీనిపై అధ్యయనం చేస్తున్నారు. యువతతో పాటు నిపుణుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. అనంతరం వివాహ వయసు పెంపుపై నిర్ణయం తీసుకుంది.

జనాభా నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకోలేదని.. ఫర్టిలిటీ రేటు తగ్గినందు జనాభా పెరుగుల ప్రస్తుతం అదుపులోనే ఉందని ఆమె తెలిపారు. మాతృత్వ వయసు, మాతా మరణాల రేటును తగ్గించడంతో పాటు మహిళా సాధికారత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.జయా జైట్లీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ 16 యూనివర్సిటీల్లో అమ్మాయిల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అంతేకాదు బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాల్లోనూ 15 ఎన్జీవోల ద్వారా అభిప్రాయాలు సేకరించారు. పట్టణాలు, పల్లెలు, అన్ని మతాలకు చెందిన వారి నుంచి కూడా సలహాలు తీసుకున్నారు. కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయినప్పటికీ.. ఎక్కువ మంది మాత్రం మహిళ వివాహ కనీస వయసుసు పెంచాలని కోరారు. ఈ క్రమంలోనే మహిళల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ అభిప్రాయపడింది.

మహిళల వివాహ వయసునకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో త్వరలోనే హిందూ వివాహ చట్టం-1955, ప్రత్యేక వివాహ చట్టం-1954, బాల్య వివాహాల నిషేధ చట్టం-2006కు సవరణలు చేసే అవకాశముంది.

వివాహ కనీస వయసు నిబంధనల వెనుక బాల్య వివాహాలను నిరోధించాలన్న ఉద్దేశం ఉంది. అయితే, అమ్మాయి జీవితంలో సమస్యలు రాకూడదన్న అంశాన్నే పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది