
గోవా స్థాపన దినోత్సవం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘గోవా ప్రజలకు వారి రాష్ట్ర స్థాపన దినోత్సవం సందర్భంలో ఇవే శుభాకాంక్షలు. గోవా ప్రాకృతిక శోభకు మరియు సహృదయులైనటువంటి ప్రజలకు నిలయంగా అలరారుతోంది. ఈ రాష్ట్రం అనేక రంగాలలో భారతదేశ అభివృద్ధి పయన గతికి జోరును జతచేస్తోంది. గోవా రాబోయే సంవత్సరాలలో కూడా నిరంతరం ప్రగతిని సాధిస్తూ ఉండాలని ఆ ఈశ్వరుడిని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఒక సందేశంలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.