బంగారం ధరలు బెంబేలెత్తిస్తాయి…

పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడతాయని PNG జ్యూవెలర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సౌరవ్‌ గాడ్గిల్‌ అంటున్నారు. ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. సోమవారం ఒక్కరోజే MCXలో 10Gms 1000₹ ఎగబాకి 46,255₹కు చేరింది. ఈ పరిస్థితులు అంచనా వేస్తూ 2020 డిసెంబర్ నాటికి 50,000₹ నుంచి 55,000₹ వరకు 10 గ్రాములు బంగారం ధరలు చేరుతాయని అంచనా వేసారు. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇంతై ఇంతింతై పసిడి లకారం తాకిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

కోవిడ్-19 వైరస్‌ భయాలు, స్పెక్యులేషన్‌, ప్రస్తుత ఆర్థిక పరిస్ధితులపై అనిశ్చితితో రాబోయే రెండు మూడేళ్లు బంగారం ధరలు పైపైకే ఎగబాకుతాయని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా, జర్మనీ దేశాలతో అత్యధికంగా బంగారం నిల్వలున్నాయి. అలాగే ఐరోపా యూనియన్‌, IMFతో పసిడి నిల్వలు భారీగా ఉన్నాయి.