ఏపీలో ప్రజలకు సీఎం జగనన్న గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలందరికీ జులై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ నిర్ణయించారు. 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నారని ఎవరు మిగిలిపోయినా మళ్లీ అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు పెట్టి అర్హతలు కూడా వివరించనున్నారు.

ఈ జాబితాలో పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలో కూడా వివరాలు తెలపనున్నారు. మే 6 నుంచి 21 వరకూ జాబితాల ప్రదర్శన, అ తర్వాత మరో 15 రోజులు వెరిఫికేషన్‌ మరియు తుది జాబితా ఖరారు కానుంది. జూన్‌ 7లోగా తుది జాబితాను ప్రదర్శిస్తారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఏమైనా కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎవరుకూడా తమకు అన్యాయం జరిగిందనే మాట అనకూడదని, అర్హత ఉండి కూడా ఇవ్వలేదనే మాట రాకూడదని, ఈలోగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ అధికారులను ఆదేశించారు.

ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి ఇంకా లబ్దిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తులు వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్లి నేను.. ఇంటి పట్టా ఎవరికైనా లేదా? అని అడిగితే లేదు అని ఎవ్వరూ అనకూడదని, నాకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, వాళ్లకీ ఇంటి స్థలం పట్టాలు ఇవ్వాల్సిందే, అర్హత ఉన్న వారు ఎవ్వరూ కూడా ఇంటి స్థలం పట్టా లేదని చెప్పకూడదని అధికారులకు హెచ్చరికలు జారీ చేసారు. దేశంలో లేదా మరే రాష్ట్రంలో మన AP రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం జరగలేదనేల నిర్ణయాలు అమలు జరగాలని ముఖ్యమంత్రి YS జగన్మోహన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.