జనం కోసమే సర్కారంటోన్న AP ముఖ్యమంత్రి జగన్మోహన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన వలస కూలీలు, అలాగే రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలసకూలీలల తరలింపు విధానాలు, విదేశాలు, వివిధ రాష్ట్రాలనుంచి దాదాపు 1.5లక్షల మంది వస్తోన్న అంశంపై అధికారులతో చర్చించారు.

NRIs ఆమూడు ఎయిర్‌పోర్టులకు:

విదేశాల నుంచి విమానాల్లో వచ్చేవారు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు చేరుకుంటారని, అక్కడే మెడికల్‌ స్క్రీనింగ్‌ చేయాలని, మార్గదర్శకాల ప్రకారం వారిని క్వారంటైన్‌ చేసి పర్యవేక్షణ చేయాలని, ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని, విదేశాలనుంచి వస్తున్న NRIs ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా వర్గీకరిస్తున్నామని, అలాగే గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న వారికి కూడా క్వారంటైన్‌ సదుపాయాలపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

మహారాష్ట్రలోని థానే నుంచి 1000 మందికిపైగా వలసకూలీలు గుంతకల్‌ వచ్చారని, వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, థానేలో కేసుల తీవ్రత అధికంగా ఉందని, వీరందరినీ పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అధికారులు CMకి తెలిపారు.

సరిహద్దుల్లో 9చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, పోలీసులు, వైద్య బృందాలు సమన్వయం చేసుకుంటామని, వలసకూలీల విషయంలో ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్‌ ఏర్పాటుచేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.

అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన కూలీలు ఇక్కడకు వచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందుకు రాలేని పరిస్థితులు ఉంటే.. వెనకడుగు వేయవద్దు, అవసరమైన పక్షంలో వారికీ ప్రయాణ సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించి, మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నవారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

డిశ్చార్జి కేసుకు సంబంధించి పటిష్టమైన ప్రోటోకాల్‌ పాటిస్తున్నామని, వరుసగా రెండు పరీక్షల్లో నెగెటివ్‌ వస్తేనే డిశ్చార్జి చేస్తున్నామని, కోవిడ్‌19 కేసుల డిశ్చార్జిలో దేశ సగటు 28.63 శాతం అయితే రాష్ట్రంలో 41.02 శాతం అలాగే పాజిటివిటీ రేటు కూడా రాష్ట్రంలో 1.26 శాతం అయితే దేశంలో 3.87 శాతం ఉందని అధికారులు వెల్లడించారు.

వ్యవసాయం అనుబంధ రంగాలు

రైతులకు అండగా నిలిచేందుకు తగినంతమేర సేకరణ చేయాలని, ఎక్కడ రైతులు సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే స్పందించాలని, ఈ విషయంలో అధికారులు దూకుడుగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.