కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య శాఖ నియంత్రణ చర్యలు

దేశంలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అనేక చర్యలు చేపట్టింది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నట్లు, కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు వివరణాత్మక ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్-19 ను సమర్ధంగా నిర్వహించే ఉద్దేశ్యంతో, దేశంలోని ప్రతి జిల్లాలను ఈ విధంగా విభజించారు :

1. హాట్ స్పాట్ జిల్లాలు, (Red Zone)
2. కేసులు నమోదై, హాట్ స్పాట్ గా నిర్ణయం కాని జిల్లాలు.
(Orange Zone)
3. గ్రీన్ జోన్ జిల్లాలు. (Green Zone)

ఎక్కువ కేసులు నమోదై, కేసుల రెట్టింపు రేటు తక్కువగా ఉండి, కేసుల సంఖ్య పెరుగుతున్న జిల్లాలను ప్రధానంగా హాట్ స్పాట్ జిల్లాలుగా గుర్తించారు.

క్యాబినెట్ కార్యదర్శి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, డి.జి.పి.లు, జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ఎస్.పి.లు., సి.ఎం.ఓ.లు, ఇతర అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ వ్యూహాలపై ఒక సవివరమైన పునశ్చరణ కార్యక్రమం నిర్వహించారు. అంతరం, ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలు, తక్కువగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో అనుసరించవలసిన వ్యూహాలపై వివరంగా చర్చించారు. కంటైన్మెంట్ ప్రాంతం, బఫర్ ప్రాంతాలను ఎలా క్రమబద్దీకరించాలీ అనే విషయంపై ఈ కంటైన్మెంట్ వ్యూహాలు వివరిస్తాయి. ఈ కంటైన్మెంట్ జోన్లలో, నిత్యావసర సేవలు మినహా, మిగిలిన ఏ కార్యకలాపాలను అనుమతించరు. నమూనా ప్రమాణాల ప్రకారం ఈ కంటైన్మెంట్ జోన్లలోని కేసులను ప్రత్యేక బృందాలు చురుకుగా పర్యవేక్షించి, సర్వే చేస్తాయి.

ఈ జోన్లలో నమూనాలు సేకరించి పరీక్షిస్తారు. దీనికి అదనంగా బఫర్ జోన్లలో ఐ.ఎల్.ఐ. (ఇన్ ఫ్లూయెంజా వంటి అనారోగ్యం) మరియు ఎస్.ఏ.ఆర్.ఐ. (తీవ్రమైన శ్వాసకోస అనారోగ్యం) వంటి ఏ కేసులనైనా పరీక్షించడానికి సరైన విధానంతో అవసరమైన ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఇంటింటి సర్వే నిర్వహించి, వైరస్ సోకినా వారిని గుర్తించడానికి వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ఈ బృందాల్లో ఆరోగ్య సిబ్బంది, స్థానిక రెవిన్యూ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది, రెడ్ క్రాస్, ఎన్.ఎస్.ఎస్., ఎన్.వై.కె., ఇతర స్వచ్చంద కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలి.

జిల్లాల్లో ఆసుపత్రులను ఈ విధంగా వర్గీకరించనున్నారు :

1. కోవిడ్ రక్షణ కేంద్రాలు – వైరస్ లక్షణాలు చాలా తక్కువగా, అతి తక్కువగా ఉన్న కేసుల కోసం.
2. కోవిడ్ రక్షణ కేంద్రాలు – ఆక్సిజెన్ అవసరం ఉండే ఓ మాదిరి క్లినికల్ కేసుల కోసం.
3. కోవిడ్ కోసం ప్రత్యేకించిన ఆసుపత్రులు – వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించవలసిన తీవ్రమైన, క్లిష్టమైన కేసుల కోసం.

కోవిడ్ పోజటివ్ గా నిర్ధారణ అయిన రోగుల క్లినికల్ యాజమాన్యం పై దృష్టి పెట్టవలసిందిగా రాష్ట్రాలు, జిల్లాలను ప్రత్యేకంగా కోరడమైనది. ఏ.ఐ.ఐ.ఎం.ఎస్. కాల్ సెంటర్ల సహకారంతో జిల్లా స్థాయిలో ప్రతి రోగి క్లినికల్ యజమాన్యాన్నీ ప్రతీ రోజూ పర్యవేక్షించాలి. మందుల నిర్వహణతో పాటు, సామాజిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం, పారిశుధ్య చర్యల వంటి ఇతర పద్దతులు క్రమం తప్పకుండా సక్రమంగా అమలయ్యేటట్లు చూడాలి.

ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాని ప్రాంతాల్లో కూడా క్లస్టర్ కంటైన్మెంట్ ప్రణాళికలు అమలుచేయాలని జిల్లాలను ఆదేశించారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా నిరోధించేందుకు అవసరమైన జాగ్రత్తలు, విధానాలు అమలుచేయాలి. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కంటైన్మెంట్ ప్రణాళికకు ఒకే విధంగా అమలుచేయాలని రాష్ట్రాలను కోరారు.

కోవిడ్-19 రోగులకు చికిత్స చేస్తున్న సిబ్బంది సామర్ధ్య నిర్మాణంకోసం అవసరమైన ఆన్ లైన్ శిక్షణ సామాగ్రి ఐ-గోట్ వేదిక పై అందుబాటులో ఉంది. రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవలసిందిగా కోరడమైనది.

నిన్నటి నుండి 1076మందికి కొత్తగా కోవిడ్-19 సోకడంతో, దేశంలో మొత్తం ధృవీకరించిన కేసుల సంఖ్య 11,439 కి పెరిగింది. కాగా, మొత్తం 377 మంది మృతి చెందారు. ఇంతవరకు మొత్తం 1036 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి ఇళ్లకు వెళ్లారు.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు : technicalquery.covid19@gov.in

ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు. ncov2019@gov.in .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075ను సంప్రదించవచ్చు.

వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా మరియు ఇతర సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .