ప్రభుత్వ స్థలాలు వినియోగంలోకి రావాలి – మంత్రి నిరంజన్

కొత్తకోట-వనపర్తి పట్టణాల మధ్యలో అభివృద్ది పనుల కోసం పరిశీలన, రెండు పట్టణాల అభివృద్దికి దోహదపడే విధంగా ప్రణాళికలు, సంకిరెడ్డిపల్లిలోని 225 సర్వే నంబర్లో 33.12 ఎకరాలు, 174 సర్వే నంబర్లో 165 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తింపు, ఉన్నత స్థాయి విద్యాసంస్థలు, 40 వేల మెట్రిక్ టన్నుల గోదాం, ఆగ్రో, ఇతర పారిశ్రామికవాడల ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.