గవర్నర్ తమిలిసై రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్

కరోనా మహామ్మారి కట్టడిపై తెలంగాణలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్‌లతో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందరాజన్ సమీక్షించారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు ఆన్‌లైన్ తరగతులను 70% నుండి 80% వరకు నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. అలాగే కొంతమంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నందున కనెక్టివిటీ సమస్యల కారణంగా హాజరు కాలేకపోయారని పేర్కొన్నారు.

ఈ కఠిన పరిస్థితుల్లో వినూత్న ఆలోచనలను వెలికితీసేందుకు కొన్ని పోటీలను నిర్వహించాలని తెలంగాణ గవర్నర్ రిజిస్ట్రార్లకు సూచించారు. విద్యార్థులందరినీ సురక్షితంగా ఉంచడానికి ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా సూచించాలని గవర్నర్ సూచించారు.