గవర్నర్‌ కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జగన్

గవర్నర్‌ కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీ సమేతంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాసానికి వెళ్లారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకే జగన్, గవర్నర్ నివాసానికి వెళ్లారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల గవర్నర్ వద్దకు వెళ్లిన కొన్ని ఫైల్స్ పై ఆయన సంతకాలు కాలేదంటూ వార్తలొచ్చాయి. వర్శిటీలకు వైస్ చాన్స్ లర్ల నియామకాలపై చాలా కాలంగా గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చర్చించడంతో పాటు, రాష్ట్రంలో కొన్ని విషయాలలో బీజేపీ తెలుపుతున్న అభ్యంతరాలపై జగన్ వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం గవర్నర్, జగన్ దంపతులు కలిసే భోజనం చేస్తారని తెలుస్తోంది. వీసీల నియామకంతో పాటు పలు ఇతర ఇష్యూలపైనా ఇరువురి మధ్యా చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ఆపై నెలాఖరులో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై కూడా ఇద్దరి మధ్యా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.