మన కోసమే Igot.gov.in

కోవిడ్-19 నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ (iGOT ) కార్యక్రమం రూపొందించింది. దేశంలోని ప్రజలందరి కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆరోగ్యేతర  ప్రొవైడర్ లకు శిక్షణ ఇచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నీ స్థాయిలలో వున్నా ఆరోగ్య, ఆరోగ్యేతర ప్రొవైడర్ లకు కోవిడ్ -19 (కరోన) నిర్వహణపై శిక్షనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ విభాగం క్లౌడ్ బేస్డ్ నైపుణ్య సామర్ధ్యాన్ని పెంచేందుకు అన్నీ చర్యలు తీసుకుందన్నార, స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్ టాప్స్ ద్వార అవసరమైన శిక్షణ మెటీరియల్, ఎంత మంది కైనా ఇవ్వడం జరుగుతుందని ఈ ట్రైనింగ్  మోడ్యుల్స్ https://igot.gov.in నుండి పొందవచ్చని ఆ ప్రకటనలో అన్నారు.

ఈ శిక్షణలో సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, ప్రాంతం వారిగా, వృతివారిగా ట్రైనింగ్ మోడ్యుల్స్ ఆయా అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ -19 వారియర్ డాష్ బోర్డులో వివిధ రాష్ట్రాల వారిగా, జిల్లాల వారిగా డాక్టర్ లు, వైద్య సిబ్బంది, స్వచంద సంస్థల వివరాలను మాస్టర్ డేటాబేస్ లో పొందుపరని అన్నారు.

దీంట్లో రైల్వే ఆసుపత్రులు, డిఫెన్స్ ఇతర సంస్థల వివరాలు కూడ పొందుపర్చారని ఆమె తెలిపారు. అత్యావసర పరిస్థితులలో స్థానిక అధికారులు  క్షత్ర స్థాయిలో పటిష్టంగా  ప్రణాళిక చేసుకునేందుకు  వెసలుబాటు కలుగుతుందన్నారు. కోవిడ్ 19 వారియర్ డాష్ బోర్డులో సురక్షిత లాగిన్ ద్వార ముఖ్యకార్యదర్శులు, మిషన్ హెడ్స్, జిల్లా కలెక్టర్ లు, కమీషనర్లు, కోవిడ్ నోడల్ అధికారులు  ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోవచ్చువని అన్నారు.

కోవిడ్ నిర్వహణలో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది ఈ వేదికలో కొత్త కోర్సుల గూర్చి  వివరాలను తీసుకోవడం తో పాటు తమని తాము సరికొత్త పరిణామాలతో అప్ డేట్ చేసుకోవచ్చు అన్నారు. ఇతర వివరాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోడల్ జాయింట్ సెక్రటరీ నెంబర్ కు  09650307575 సంప్రదించవచ్చు అన్నారు.(email –[email protected])