గ్రేటర్ గ్రీన్ జోన్ ఛాలెంజ్…

తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఆదేశాలతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఆధ్వర్యంలో కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తుత స్థితిగతులపై కార్యచరణ రూపొందించనున్నారు.

ప్రగతి భవనంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. సామాజిక దూరం ఉద్దేశ్యంతో సమావేశంలో జాగ్రత్తలు తీసుకున్నారు.