కోనసీమను అద్ధంపడుతోన్న తెలంగాణ పల్లెలు…

ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ పల్లెల్లో పచ్చదనం పరుచుకున్నట్టు కనబడుతోన్న ఈ పచ్చిక బయళ్లు అచ్చంగా ఆ ప్రాంత పరిసారల్లాగే ఉన్నాయి. కానీ అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా గోదావరి గలగల పారుతూ పరుగులు పెడుతోంది. కాళేశ్వరం మహా ప్రాజెక్రు కారణంగా కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ పరిసరాలు ఎటు చూసినా పచ్చని పాడి పంటలతో కనుల విందు చేస్తున్నాయి. అందుకు నిదర్శనమే ఈ ఫోటోలు.