గల్ఫ్ కు నకిలీ వీసాల టీం గుట్టురట్టు

గల్ఫ్ కు నకిలీ వీసాల టీం గుట్టురట్టు

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ లో నకిలీ విస్సాల సృష్టిస్తూ గల్ఫ్ దేశాలకు పంపే ముఠాను ఎస్ఓటి పోలీసుల సహకారంతో అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు..

బోడుప్పల్ శ్రీనివాస నగర్ కాలనీలో ఉంటూ నకిలీ విస్సాలు సృష్టించి నేపాల్ కి చెందిన మహిళలను గల్ఫ్ దేశాలకు (ఇరాన్ కుర్తకుస్తాన్) పంపుతున్న నరేష్(29), తిరుపతి రెడ్డి(29) అనే ఇద్దరు వ్యక్తులు.

గతంలో దిల్సుక్ నగర్ ప్రాంతంలో నకిలీ విస్సాల ఆఫీస్ నడిపిన దుండగులు, అక్కడి నుండి బోడుప్పల్ కి మార్చి నకిలీ విస్సాల తో అక్రమ సంపాదన నడిపిస్తున్న ఇద్దరి సభ్యుల ముఠా. గతంలో నికిలీ సర్టిఫికేట్స్ తో విస్సాలు సృష్టించి 150మంది నేపాల్ కి సంబంధించిన ప్రజలను గల్ఫ్ దేశాలకు పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడి. అరెస్టు చేసిన ఇద్దరి వద్ద నుండి ఏడు ఇండియన్ పాస్పోర్ట్స్, రెండు నేపాల్ పాస్పోర్ట్స్, 4సెల్ పోన్స్, 1ల్యాప్‌టాప్‌, స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి ప్రెస్ మీట్ లో వెల్లడించారు.