సంచనల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాలో విరహ వేదనలో కాలం వెల్లదీస్తున్నారు. కరోనా వైరస్ యుద్ధంలో భాగంగా అమలులోన్న లాక్ డౌన్ సామాజిక దూరం గుత్తాజ్వాలా, తమిళనటుడు విష్ణు విశాల్ మధ్య విరహ వేదను మిగిలిస్తోంది. గత కొంత కాలంగా వీరిరువురు డేటింగ్లో ఉన్నారు. దీంతో తరుచూ కలుసుకునే వీళ్లకు అవకాశాలు లేకుండా పోయాయి. ఎప్పుడైతే డేటింగ్ ఫోటోలు కలిసి మెలసి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేవారు. ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉండడంతో హైదరాబాద్ లో గుత్తా జ్వాలా, మరోవైపు ప్రియుడు విష్ణువిశాల్ చెన్నైలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తన విరహ వేదనను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. తన బూను మిస్ అవుతున్నట్టు గుత్తా జ్వాలా చేసిన ట్వీట్ రిప్లై ఇస్తూ OK ఇప్పుడు సామాజిక దూరం పాటించడం ముఖ్యమంటూ రీ ట్వీట్ ద్వారా ఓదార్చాడు విష్ణు విశాల్.