టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఉద్యమ పార్టీగా ఉద్భవించి, ఉద్యమనేత కేసీఆర్ సారధ్యంలో ఆమోఘమైన రీతిలో తెలంగాణా ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కలను నిజం చేసిన ఘనత టీఆర్ఎస్ ది. ఆ తరవాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా పరిణామం చెంది 2014 లో సంపూర్ణ మెజారిటీని సాధించి తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి పార్టీగా చరిత్రకెక్కింది. ఇక దార్శనిక నేత ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఏకకాలంలో అమలుచేసి రెండోసారి కూడా పాలనాపగ్గాలను అందుకొని, రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొని, విశేష ప్రజాదరణతో 70 లక్షలకు పైగా సభ్యత్వం కలిగిన పార్టీగా తెలంగాణా యవనికపై చిరస్థాయిగా నిలిచింది.

తెలంగాణా దిశానిర్దేశకుడు, రాష్ట్ర భాగ్యవిధాత, బంగారు తెలంగాణాకు పునాదులు వేసిన మహానేత, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాబోయేరోజుల్లో టీఆర్ఎస్ పార్టీ మరిన్ని ప్రస్థానాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.