TS/APల్లో నిరాడంబరంగా ఉగాది ఉత్సవం

నిరాడంబరంగా ఉగాది ఉత్సవం

తెలుగు సంవత్సరాది ఉగాదికి ఉభయ తెలుగు రాష్ట్రాలు నిరాడంబరంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఉదయం పంచాంగ పఠన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో ఇంట్లోనే కార్యక్రమాన్ని వీక్షించాలని విజ్ఞప్తి చేసారు. ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోవైపు ఆంధ్రప్రదేశ్ CM జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కరోనా నియంత్రణ చర్యల కోసం తిరుమల-తిరుపతి, భద్రాచలం, యాదాద్రి, శ్రీశైలం ఆలయాల్లో దర్శనాలు రద్దు చేశారు. ఇరు రాష్ట్రాల్లో దేవాలయాల్లో భక్తులందరికి అనుమతి లేదని, ప్రభుత్వం తరఫున ఆలయాల్లో తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తులెవరూ నవమి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వ ఆధ్వర్యంలో సుదర్శన, మృత్యుంజయ హోమాలు నిర్వహిస్తున్నారు.