TS ఫోటో జర్నలిస్టులకు మంత్రి హరీష్ బాసట

తెలంగాణ ఫోటో జర్నలిస్టులకు బాసటగా నిలిచింది టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ కెనడా విభాగం. టిఆర్ఎస్ ఎన్నారై కెనడా విభాగం అధ్యక్షుడు కృష్ణ కుమార్ కోమండ్ల నేతృత్వంలోనీ బృందం సమకూర్చిన నిత్యవసర వస్తువులను తెలంగాణ ఫోటో జర్నలిస్టులకు పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరిగింది.

టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కెనడా విభాగం అందించిన ఆర్థిక సహాయంతో మంత్రి హరీష్ రావు గారి సూచన మేరకు హైదరాబాదులో ఫోటో జర్నలిస్టుల కు నిత్యావసర సరుకులను తెలంగాణ ఐటీ సెల్ కన్వీనర్ గిరిధర్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు అందజేశారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ కరోనా వల్ల జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తమ కెమెరాల్లో బంధించి వార్తాపత్రికలు పంపిస్తున్నా ఫోటో జర్నలిస్టు చేస్తున్న కృషి ఈ సందర్భంగా గా కొనియాడారు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు అందిస్తూ అటు ఇటు ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారు జర్నలిస్టులు.

హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ జి భాస్కర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజ్ కుమార్ అధ్యక్షులు పరమేశ్వర్ రాష్ట్ర కోశాధికారి సర్వీస్ రెడ్డి తో పాటు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లు , ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్లు కు టిఆర్ఎస్ ఐటి సెల్ కన్వీనర్ గిరిధర్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నిత్యవసర వస్తువులను అందజేశారు.