ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం..

క‌రోనా వైర‌స్‌ మహామ్మారి పరద్రోలాలంటే ఒక్కటే మార్గం వ్యాధి నిరోధకత పెంచుకోండిలా ఆంటోన్న వైద్యులు. మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా A, C అలాగే D విటమిన్లు ఉండాల్సిందే.

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అన్నారు పెద్ద‌లు. తిండి క‌లిగితేనే కండ క‌ల‌దోయ్‌ అన్నారు మ‌రొక‌రు ఈ మాట‌లు అక్షర సత్యాలు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే నిత్యం జీవితంలో ఎదుర‌య్యే అనేక స‌వాళ్ల‌త పాటు అనారోగ్యం బారిన ప‌డకుండా తన జీవితంలో రాణిస్తుంటారు. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. అయితే ఇప్పుడే ఈ మాట‌లు ఎందుకు చెప్పాల్సివ‌స్తుందంటే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ మ‌హామ్మారీ మ‌నుషుల‌ను ప‌ట్టి పీడిస్తోంది. దీని భారిన‌ప‌డ‌కుండా ఉండాలంటే శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డంతో పాటు ఎలాంటి రోగాలు ద‌రి చేర‌కుండా త‌మ‌ను తాము కాపాకోవాల్సిన ఆవ‌శ్య‌త ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో పోష‌కాహార నిపుణులు వ్యాధి నిరోధ‌క‌త‌ను పెంచుకోవ‌డానికి తీసుకోవాల్సిన ఆహారంతో త‌దిత‌ర విష‌యాల‌ను సూచిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అవేంటో తెలుసుకుందాం..!.
తెల్ల ర‌క్త‌క‌ణాల వృద్ధిలో సీ విట‌మిన్ కీల‌క పాత్ర‌:
-శ‌రీరంలో తెల్ల ర‌క్త‌క‌ణాల‌ను వృద్ధిచేసేందుకు సీ-విట‌మిన్ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇందుకోసం కమలాలు, ద్రాక్ష, కివీ పళ్లు, స్ట్రాబెర్రీలు, బెంగళూరు క్యాబేజీ, మిరియాలు, ఉడికించిన క్యాబేజీ, గోబీ పువ్వుల్లో విటమిన్‌-సీ అధికంగా లభిస్తున్న నేప‌థ్యంలో దిన‌స‌రి ఆహారంలోవాటిని త‌ప్ప‌కుండా ఉండేట‌ట్లు జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

వ్యాధి నిరోధకత పెంచుకోండిలా..!
శరీరంలో వ్యాధి నిరోధ‌క‌త‌ను పెంచుకునేందుకు ప్ర‌త్యేకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే ప్రోటీన్‌ ఉత్పత్తికి విటమిన్‌-డీ దోహదం చేస్తుంది. ఇది సూర్యరశ్మి నుంచే లభిస్తుంది. ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో సరిపడా ఎండ ఉంటున్నా… చాలామందిలో విటమిన్‌-డీ లోపం కనిపిస్తోంది. అందువ‌ల్ల ఉద‌యం వేళ‌ల్లో సూర్యోద‌యం స‌మ‌యంలో ఎండ త‌గిలేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. అదే విధంగా చేపలు, గుడ్లు, పాలు, చీజ్‌, వెన్న, పన్నీరు, పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయ‌డంతో శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరిగి వైర‌స్ మ‌హామ్మారిని నుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా జింక్‌ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధులతో పోరాడేలా చేస్తుంది. పౌల్ట్రీ ఉత్పత్తులు, జంతు మాంసం, సోయాబీన్‌, శనగలు, చిక్కుళ్లు, చిరు ధాన్యాలు, గింజలు, చీజ్‌, పన్నీరు వంటి వాటిల్లో జింక్ పుష్క‌లంగా ల‌భిస్తోంది. అందువల్ల రోజులో క‌నీసం ఒక‌సారైన వీటిని తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

విట‌మిన్‌-ఏ కీల‌కం:
శరీర దారుఢ్యానికి చోదకంగా పని చేయడంలో విటమిన్‌-ఏ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన విష కణాలను, శరీరంలోకి చొరబడిన వైరస్‌లు, బ్యాక్టీరియాలను బయటకు నెట్టివేయడానికి వ్యాధి నిరోధక వ్యవస్థకు తోడ్ప‌డుతుంది. క్యారెట్లు, ఆకుకూరలు, చిలగడదుంప, బ్రోకోలి, కాలే(క్యాబేజి కుటుంబానికి చెందిన ఆకుకూర), కీరా, మామిడి పండ్లు, కర్బూజా, యాప్రిక్యాట్లలో పుష్కలంగా లభించే బీటా కెరోటిన్‌ అనే పదార్థం విటమిన్‌-ఏగా రూపాంతరం చెందుతుంది. అందువల్ల నిత్యం ఆకుకూర‌లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో క‌రోనా మ‌హామ్మారి నుంచి త‌ప్పించుకునేందుకు పోష‌క విలువ‌ల‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాల్సి..ప్ర‌స్తుతం ఇదొక్క‌టే మార్గ‌మ‌ని పోష‌కాహార నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.