బెంగళూరులో భారీ వర్షం

కర్ణాటక రాజధాని బెంగళూరులో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షానికి బెంగళూరు తడిసి ముైద్దెంది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. కూలీనగర్‌లోని ఓ ప్రభుత్వ క్వార్టర్స్‌ ప్రహరీ గోడ కూలిపోయింది. అక్కడ పార్క్‌ చేసిన వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షం కురిడయంతో బెంగళూరు మున్సిపల్‌ అధికారులు ఎనిమిది కంట్రోల్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు బెంగళూరులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 14 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.