తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిల్లపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షానికి గ్రామంలో పలుచోట్ల చెట్లు కూలీ పడ్డాయి. బీభత్సమైన గాలితో ఉరుములతో కూడిన వర్షం పడడంతో ఊరి చివరన ఇల్లు ఉండడం చేత విపరీతమైన గాలికి గ్రామంలోని ఓ ఇంటిపై కప్పున ఉన్న రేకులు గాలికి లేచిపడి విరిగిపోయాయి. అలాగే కొంత దూరంగా ఉన్న చెట్లు గాలికి వచ్చి ఇంటి ముందు ప్రహరీ గోడపై పడడంతో ప్రహరీ గోడ కూలీ పొయింది. గ్రామంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం స్పందించి సాయం అందించాలని గ్రామస్థులు కోరుకుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మేట్ మండలం లోని కోహెడ మార్కెట్ లో భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీగా గాలులు విస్తుండటంతో ఒక్కసారిగా కూలిపోయిన షేడ్స్, పలువురి రైతులకు గాయాలయ్యాయి.భారీ గాలులకు మామిడి పండ్ల లారీ సైతం కొట్టుకు పోయింది. భారీ వర్షానికి అతలాకుతలం అయిన కోహెడ పండ్ల మార్కెట్ దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.